పూరీ ఎందుకిలా చేసావ్ ? - Telugu News - Mic tv
mictv telugu

పూరీ ఎందుకిలా చేసావ్ ?

July 14, 2017

ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం సినిమాతో టాలావుడ్ లోకి పాదం మోపిన పూరీ జగన్నాథ్ ఆ తర్వాత యూత్ కు నచ్చే బోలెడు సినిమాలు తీసాడు. యూత్ కు ఎలా చెప్పితే ఎక్కుతుంది ? వారి నాడీ ఎలా పట్టుకోవాలి ? వాళ్ళకు నీతులు స్ట్రెయిట్ గా చెప్తే అస్సలు దిమాక్ కు ఎక్కవు.. నీతులను బూతుల్లో చుట్టి చెప్తే సూపర్ గా ఎక్కుతుందని పూరి ప్రగాఢంగా నమ్మిన సిద్ధాంతంతో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ విన్నయ్యాడు. తన లైఫ్ లో కూడా నీతిగా బతికితే అస్సలు పస వుండదని గ్రహించుకొనే డ్రగ్స్ కి దగ్గరైనట్టున్నాడు. కొంపదీసి ఇన్నాళ్ళు అతను తీసిన సినిమాలన్నీ డ్రగ్స్ పుచ్చుకొనే చేసినట్టున్నాడు అందుకే అవి అంత నీటుగా, హాటుగా వుంటాయి కాబోలు !? పూరి సినిమాలను ఆదర్శంగా తీస్కొని బా..గు పడ్డ యువత చా.. లా.. ! అన్నీ యూత్ కు గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే.

తెలుగు ఇండస్ట్రీకి పూరీ అంటే ఒక సపరేట్ మార్కును క్రియేట్ చేస్కున్నాడు. ఒక అబ్బాయి ఇడియట్ లా అమ్మాయిని ఎంత చిర్రెత్తించొచ్చో, పోకిరీలా ఆడవాళ్ళను ఆట వస్తువులా ఎలా వాడుకోవచ్చో, లోఫర్ లా, రోగ్ లా ఇలా.., అష్ఠ దరిద్రాలతో ఈ సమాజానికి ఏ విధమైన మంచిని చెయ్యొచ్చో పూరీకి తెలిసినంతగా ఇంకే డైరెక్టరుకు తెలీదేమో ? ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న ఆయన ఇలా డ్రగ్స్ మాఫియాలో చిక్కటం చూస్తుంటే నెక్ట్స్ తన సినిమా డ్రగ్స్ మీదే తీస్తుండొచ్చు. అందులో యూత్ కు మంచి మంచి నీతులు చెప్తుండొచ్చు ! దానికి టైటిల్ పూరీ ఎందుకిలా చేసావ్ అని పెట్టి తీసి హిట్టు కొట్టేస్తుండొచ్చు !!