బాలయ్యకు బౌన్సర్లు అవుసరం లేదు..! - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్యకు బౌన్సర్లు అవుసరం లేదు..!

August 18, 2017

అవును నిజమే …నిన్నా,అంతకు ముందు సూల్లేదా బాలయ్య బాబు అందరిని ఏ తీరుగ అర్సుకుంటడో..దౌడలు వల్గాల్సిందే.నిన్న జరిగిన పైసా వసూల్ ఆడియో ఫంక్షన్లో  బాలయ్య బాబు గురించి ఆ సిన్మ డైరెక్టర్ పూరీ మాట్లాడిండు..అబ్బబ్బ అది వింటే అందరి మైండ్ బ్లాకయ్యి,రెడ్ అయ్యి గ్రీన్ కూడా అవుతుంది.

వేరే హీరోలు బయటికెళితే బౌన్సర్లు కావాలేమో,బాలకృష్ణకి అక్కర్లేదు,ఆయన అభిమానులను ఆయన కంట్రోల్ చేసుకోగలడు,ఒక్కోసారి జనాలు మీద పడుతుంటే ఆయన కొట్టేస్తారు,ఆయన కొడుతుంటే అభిమానులకు చాలా ఇష్టం,బాలయ్య బాబుకి,ఫ్యాన్స్ కి మధ్య ఉన్న అనుభందం అది. మల్లెప్పుడైనా బాలయ్య ఎవరినైనా కొడితే అది వాళ్లకు బాలయ్య బాబుకు మద్యలో ఉన్న లవ్ అని గుర్తుంచుకోండి.అని పూరీ అన్నారు.అవునా సారు మీరూ బాలయ్య బాబు ఫ్యాన్ నని చెప్తుంటారు కదా ఓ సారి ట్రైజెయ్యరాదు.

బాలయ్యమీద ప్రేమతోని వర్షమచ్చినా వరదచ్చినా…ఎక్కడికి వెళ్లకుండా ఉన్నారు.మీలాగే బాలయ్య బాబు కూడా చాలా మొండోడు.ఇన్నాళ్లు ఆయనతో ఎందుకు సినిమా తీయలేదా అని బాదపడ్డాను,ఆయనకు కోపం వచ్చినా ,ప్రేమచ్చినా మొహంమీదే…చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి.నాన్నగారు,సినిమా తప్ప వేరే ద్యాసుండదు,వేరే మాట్లడరు అని పూరీ అన్నారు.

ఫైటర్లు కనపడితే మీద పడిపోతారు,ఆయనకు ఓ కారు ఇస్తే 360రౌండ్ డిగ్రీ కొట్టేస్తారు.హీరోయిన్లను అమాంతం ఎత్తుకుని పరుగెడతారు.నేను ఆయనకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను మీదీ మోక్షాజ్జ వయసు కాదు కొంచెం తక్కువనీ..తల్లిదండ్రులమీద ఇంత గౌరవం ఉన్న కొడుకుని నేనెక్కడా చూల్లేదు అని పూరి అన్నారు..కానీ ఆడాళ్లమీద కూడా ఆయనకు గౌరవం ఎక్కువ పూరీ సార్…అందుకే ఆడాళ్లను చూస్తే ముద్దైనా పెట్టాలి,కడుపైనా చెయ్యాలి అని అంటారు.చివరగా కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ  అని పూరీ జగన్నాథ్ ఆయన స్పీచ్ ని ముగించారు.