Home > Featured > అప్పుల భారంతో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య

అప్పుల భారంతో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల హైదరాబాదులోని దుర్గం చెరువులో దూకి సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో సాయి కుమార్ గతంలో పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్టు గుర్తించారు. అప్పులు ఎక్కువై ఇబ్బందులు తాళలేక సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, లైగర్ సినిమాను తెరకెక్కించిన పూరీ జగన్నాథ్.. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో భారీ నష్టాలను చవిచూశాడు. దీని దెబ్బకు ముంబైలో అద్దెకుంటున్న ఫ్లాట్ రెంట్ కట్టలేక హైద్రాబాద్ వచ్చేశాడని రూమర్లు వచ్చాయి. అటు విజయ్ దేవరకొండతో తీయాల్సిన తదుపరి చిత్రం ‘జనగణమన’ కూడా వాయిదా పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో తన తదుపరి సినిమాగా ‘ఇస్మార్ట్ శంకర్ 2’ ని తెరకెక్కించే పనుల్లో నిమగ్నమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Updated : 10 Sep 2022 1:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top