పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో ఇమ్రాన్ మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో క్లిప్‌లు బయటకు వచ్చాయి. పాక్ జర్నలిస్టు సయ్యిద్ అలీ హైదర్ ఆ ఆడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. పాక్ ప్రధాని కార్యాలయం నుంచి ఆ ఆడియో లీకైనట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఇమ్రాన్ తన పదవి కోల్పోయిన తర్వాత ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది.
Imran Khan Audio leak 1/2#audioleak #Audioleaks #ImranKhanAudioLeaks#ImranKhanAudioLeak pic.twitter.com/9ebj8hbJyq
— Sheikh Asghar (@shaikhasgher) December 19, 2022
ఈ ఘటనపై ఇమ్రాన్‌కు చెందిన తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ స్పందించింది. అవన్నీ తప్పుడు ఆడియో క్లిప్లని పేర్కొంది. ఇమ్రాన్‌ను లక్ష్యంగా చేసుకొని అటువంటి ఆడియో, వీడియో క్లిప్‌లను ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆరోపించింది. ప్రత్యర్థులు అంతకు మించి ఆలోచించలేరని ఎద్దేవా చేసింది.
Imran Khan Audio leak 1/2#audioleak #Audioleaks #ImranKhanAudioLeaks#ImranKhanAudioLeak pic.twitter.com/9ebj8hbJyq
— Sheikh Asghar (@shaikhasgher) December 19, 2022
లీక్ చేసిన కాల్స్‌లో.. ఓ వ్యక్తి( ఇమ్రాన్ ఖాన్ వాయిస్) ఫోన్లో మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. పర్సనల్‌గా కలవాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉంది. అందుకు ఆమె అయిష్టంగానే అతడితో మాట్లాడినట్లు ఉంది. నువ్వు ఒకే అంటే రేపు కలుద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో సదరు వ్యక్తి మాట్లాడుతూ తన భార్యా పిల్లలు ఆ రోజు వస్తున్నారని.. కుదిరితే వారి రాకను పోస్ట్‌పోన్ చేస్తానని చెప్పారు. ఏ విషయం అనేది రేపు చెబితే మళ్లీ ఫోన్ చేసి కన్ఫామ్ చేస్తానని చెప్పారు. ఈ ఆడియో క్లిప్‌లు నకిలీవని, ఫేక్ వీడియోలను ప్రభుత్వం సృష్టిస్తోందని తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది. మహిళతో జరిపిన సంభాషణలో మాట్లాడింది ఇమ్రాన్ అవునా కాదా అన్న విషయం తేలాల్సి ఉంది.