"Pushing Round The Clock": Viral Image Shows Twitter Employee Sleeping On Office Floor
mictv telugu

విన్యాసాల రాహుల్..ఓట్ల వాన కురిపించేనా?

November 3, 2022

"Pushing Round The Clock": Viral Image Shows Twitter Employee Sleeping On Office Floor

ఎంతో మంది నేతలు పాదయాత్రలు చేశారు. వేల కిలోమీటర్లు నడిచారు. ప్రజల్ని కలుస్తూ టార్గెట్ పూర్తి చేశారు. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంథింగ్ స్పెషల్. ఊహించని ఫీట్లతో అదరగొడుతున్నారు. రాహుల్ చేసే విన్యాసాల్ని చూసి ఆ పార్టీ నేతలు అవాక్కవుతున్నారు. నడి సంద్రంలో ఈత నుంచి పోతురాజు విన్యాసాలదాకా జనాన్ని తెగ ఆకట్టుకున్నారు. ఈ వయస్సులో రాహుల్‌కు ఇంత ఫిట్‌నెస్ ఎలా?ఆయన సక్సెస్ మంత్ర ఏంటి?

మరో కోణం

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమెంటోగానీ..పాదయాత్రలో ఆయన చేసే విన్యాసాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. యాత్ర మొదలైన రోజు నుంచి సడెన్ సర్‌ప్రైజ్‌లు ఉంటున్నాయి. అలా నడుస్తారు..ఇలా కలుస్తారు..ప్రజలతో మాట్లాడుతూ వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. నా స్టయిలే ఢిఫరెంట్ అంటూ రాహుల్ ముందుకుసాగుతున్నారు. ఇప్పటిదాకా వందల కిలోమీటర్ల నడిచారు. కన్యకుమారి నుంచి మొదలైన యాత్ర సంగారెడ్డి దగ్గర వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడిదాకా రాహుల్‌లో ఎప్పుడు అలసట చూడలేదు. ఉరిమే ఉత్సాహంతో ఆయన అడుగులువేస్తున్నారు. పాదయాత్రలో పరుగులు పెడుతున్నారు. తనతో జాయిన్ నేతల్ని పరుగులు పెట్టిస్తున్నారు.

రైజింగ్ రాహుల్

Rahul Gandhi Bharath Jodo Yatra Fitness

రన్నింగే కాదు పుష్ అప్‌లు చేస్తున్నారు. 10 సెకన్లలో 14 పుష్ అప్‌లు కొట్టి ఆశ్చర్యపరిచారు. తనతో పాటు ఉన్న నేతల్ని చేయమంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆయనతో పోటీపడలేకపోతున్నారు.మావల్ల కాదు బాబోయ్ అంటూ మధ్యలోనే ఆగిపోతున్నారు. గతంలో కేరళలో నడిసముద్రంలోకి రాహుల్ దూకేశారు. జాలర్తతో కలిసి గంటసేపు ఈత కొట్టారు. ఇప్పుడు కర్నాటకలో పాదయాత్రకు వచ్చిన నేతల్ని రాహుల్ ఉరికించారు. ఆఖరకు సిద్ధరామయ్య కూడా రాహుల్ తో కలిసి పరుగెత్తే ప్రయత్నం చేశారు. అత్యంతవేగంగా వాటర్ ట్యాంక్ ఎక్కి ఆశ్చర్యపరిచారు. ఓ చిన్నారిని భూజాలపై ఎత్తుకుని నడిచారు. జోకులు వేస్తూ ఉత్సహ పరుస్తూ పాదయాత్రకొచ్చిన వారితో కలిసి నడుస్తున్నారు. ఏపీలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారత్ జోడో యాత్ర సాగింది.

క్రికెటర్ నుంచి పోతురాజు దాకా

Rahul Gandhi Bharath Jodo Yatra Fitness

తెలంగాణలో ఉరిమే ఉత్సాహంతో రాహుల్ యాత్ర సాగుతోంది. పల్లె నుంచి సిటీ దాకా రోడ్లపై నేతల్ని ఉరికించారు. పిల్లలతో కలిసి రన్నింగ్ రేసు పెట్టుకున్నారు. ఈ రేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పిల్లలే కాదు రాహుల్ స్పీడ్‌ని రేవంత్ అందుకోలేకపోయారు.రోడ్డుపై క్రికెట్ ఆడారు. అద్బుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. ప్రాంతాల సంప్రదయాల్ని తెలుసుకుంటూ వారితో కలిసి అడుగులేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో పోతురాజుల విన్యాసాలు చేశారు. కొరడాతో వంటిపై కొట్టుకున్నారు. బోనాల పండుగ విశిష్టతని జగ్గారెడ్డిని రాహుల్ తెలుసుకున్నారు.

నేతల రియాక్షన్

Rahul Gandhi Bharath Jodo Yatra Fitness

నెరిసిన గడ్డంతో రాహుల్ గాంధీ చేస్తున్న ఫీట్లు జనాన్నే కాదు నేతల్ని ఆకట్టుకుంటున్నాయి. స్వంతపార్టీలు మెచ్చుకుంటే ప్రత్యర్థి పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దేహదారుడ్యం కోసమే రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్ని వదిలేసి దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు.

రాహుల్ ఫిట్‌నెస్ మంత్ర

Rahul Gandhi Bharath Jodo Yatra Fitness

రాహల్ గాంధీ ఫిటెనెస్‌కు ఫిదా అవుతున్నారు కుర్రకారు. ఆయన ఆరోగ్య రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. డైలీ డైట్ మెనూ ఏంటో వాకబు చేస్తున్నారు. ఉదయాన్నే రాహుల్ టీ బిస్కెట్లు తీసుకుంటారు. ఉదయం 11 తర్వాత టిఫిన్ చేస్తారు.మధ్యాహ్నం నాన్ వెజ్ కంపల్సరీ. ఇందులో సీ ఫుడ్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారట. రాత్రి రోటి, చపాతీలు తింటున్నారని రాహుల్‌ని దగ్గర నుంచి కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో లాక్‌డౌన్ టైమ్‌లో రాహుల్ సూపర్ ఫిట్‌నెస్ తో యూత్ మనస్సు దోచుకున్నారు. నెటిజన్లు ఫిట్‌నెస్ టిప్స్‌ని అడిగి మరి తెలుసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రలో రాహుల్ లక్ష్యాన్ని కన్నా విన్యాసాలపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు.