"Pushing Round The Clock": Viral Image Shows Twitter Employee Sleeping On Office Floor
mictv telugu

చుక్కలు చూపిస్తున్న మస్క్.. ఆఫీసుల్లోనే నిద్రిస్తున్న ఉద్యోగులు

November 3, 2022

"Pushing Round The Clock": Viral Image Shows Twitter Employee Sleeping On Office Floor

ట్విట్టర్ తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే పలువురు కీలక అధికారులను తొలగించిన మస్క్.. కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లను రోజుకు 12 గంటలు పనిచేయాలని హుకుం జారీ చేశారు. అదేవిధంగా ఏడు రోజులూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ లో ఓ ఫోటో వైరల్ గా మారింది.

ఆ ఫోటోలో ట్విట్టర్ లో పని చేస్తున్న ఓ మేనేజర్ ఆఫీసులో పని చేసి చేసి.. ఇంటికి వెళ్లే సమయం లేక.. అక్కడ నిద్రపోయింది. దీనిని ఓ ట్విట్టర్ ఉద్యోగి షేర్ చేయడం గమనార్హం. స్లీపింగ్ బ్యాగ్ లో దూరి.. ఆఫీసులో టేబుల్, చైర్ల వెనక పడుకోవడం గమనార్హం. ట్విటర్‌లో ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ ఎస్తర్‌ క్రాఫోర్డ్‌ ఆఫీసులోనే నేలపై నిద్రిస్తున్న ఫొటోను ఇవాన్‌ అనే ఉద్యోగి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ట్విటర్‌ బాస్‌ నుంచి ఏదైనా కోరుకున్నప్పుడు ఇలా ఉండాల్సిందే’’ అని దానికి క్యాప్షన్‌ తగిలించాడు. ఇంటికి వెళ్లే సమయం కూడా లేకపోతే ఏం చేస్తారు.. ఇలానే ఉంటుంది మరి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.