పుష్ప సినిమా కాఫీ కథే - MicTv.in - Telugu News
mictv telugu

పుష్ప సినిమా కాఫీ కథే

December 22, 2021

puspa

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం దక్షిణాదిలో బాక్స్‌ఫీస్‌ వద్ద దుమ్ము రేపుతుంది. భారీ వసూళ్లను రాబడుతోంది. ‘తగ్గేదేలే’ అనే డైలాగ్, ‘ఊ అంటావా మామ – ఊఊ అంటావా మామ’ అనే ఐటెం సాంగుతో ఎంతగా దూసుకువెళ్తుందో అందరికి తెలిసిందే.

అయితే, ఈ సినిమాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పుష్ప సినిమాను దర్శకుడు సుకుమార్ కాఫీ కొట్టారంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు. నెట్ ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ నార్కోస్ కథ ఆధారంగా ఈ పుష్పను సినిమాను తీశారని విమర్శిస్తున్నారు. నార్కోస్’లో డ్రగ్స్ మాఫియా ఉంటే… ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించారంటున్నారు. అంతేకాకుండా అందులో హీరో నటించిన విధంగానే అల్లు అర్జున్ పాత్ర ఉందని విమర్శిస్తున్నారు. పాన్ ఇండియా అనే పేరుతో కాపీ కథతో సినిమాను తెరకెక్కించడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు.