పుష్పలో ఆ సీన్స్ కట్ - MicTv.in - Telugu News
mictv telugu

పుష్పలో ఆ సీన్స్ కట్

December 20, 2021

తెలుగు చిత్రసీమ పరిశ్రమలోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో సైతం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న సినిమా పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అయితే, మొదటి రోజు ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా, అభిమానులు మాత్రం తగ్గేదేలే అంటూ సినిమా హాల్లో హల్‌చల్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆసభ్యంగా ఉన్నాయంటూ, విమర్శలు వస్తుడడంతో ఆ సన్నివేశాన్ని కట్ చేసినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.

ఇంతకి ఆ సన్నివేశం ఏదంటే.. హీరో మీదున్న ఫీలింగ్స్‌ను హీరోయిన్ తెలియజేసే సన్నివేశంలో అల్లు అర్జున్ రష్మిక ఎదనుతాకే సన్నివేశాన్ని తొలగించారు. ఓ స్టార్ హీరో అలాంటి సన్నివేశాలు ఎలా చేస్తాడంటూ నిర్మాణ సంస్థలకు సన్నిహిత వర్గాలు సూచించాయట. అంతేకాదు దర్శకత్వం వహించిన సుకుమార్ సన్నిహితులు కూడా ఆ సన్నివేశం పెట్టడం సరైంది కాదని తెలుపడంతో, ఆ సీన్ కట్ చేసినట్లు నిర్మాణ సంస్థ వారు వెల్లడించారు.