క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న విరాట్ క్లోహిపై ప్రస్తుతం ఆర్సీబీ ప్రియులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. క్లోహి ఆటతీరు సరిగ్గా ఉండడం లేదని, క్లోహిని పక్కన పెట్టాలని యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం..రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చేలరేగి ఆడుతారని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో క్లోహిని ఓపెనర్‌గా వచ్చాడు. బ్యాటింగ్‌లో ప్రమోషన్ వచ్చినా పరుగులు చేయడంలో మాత్రం మళ్లీ ఫెయిలయ్యాడు. ఆరంభంలోనే రెండు ఫోర్లు కొట్టి, టచ్‌లోకి వచ్చినట్లు అనిపించినప్పటికి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 9 పరుగులకే కోహ్లి తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు కలిపి, 128 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో కోహ్లిపై ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశ చెందారు. ”ఓపెనర్‌గా వచ్చిన క్లోహి ఆటతీరు మారలేదు. ఏ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చినా అదే ఆటతీరు. కావున కొన్ని రోజులు పక్కన పెట్టేయండి” అని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.