Put Tricolour as Your Profile Picture from Aug 2 to 15, Says PM Modi
mictv telugu

జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి.. ప్రధాని మోడీ

July 31, 2022

దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా దేశ జాతీయ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 15 వరకూ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో డీపీగా(డిస్‌ప్లే పిక్చర్)గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని సూచించారు. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకూ నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగ’లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆగస్ట్ 15న నిర్వహించకోనున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఆగస్ట్ 2న జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆరోజు నుంచే సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ డ్రైవ్ ఆరంభించాలని ప్రధాని తెలిపారు.