రక్తంతో స్నానం ఏందిరా  నాయనో....... - MicTv.in - Telugu News
mictv telugu

రక్తంతో స్నానం ఏందిరా  నాయనో…….

July 21, 2017

కట్టప్పా… మాహీష్మతికి మకిలి పట్టింది…… ఆ తర్వాత  డైలాగ్ మీకు తెల్సే ఉంటుంది. అది సిన్మా కాబట్టి ఏదో… డైలాగ్ బాగుందని… చెప్పే స్టార్ ఇంకా బాగా చెప్తారని అట్లా రాసి ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా ఓరేయ్…. నీ రక్తం కళ్ల చూస్తాను  రా  అని హెచ్చరిస్తారు….   ఇంకా కొందరైతే… వాడు పచ్చి రక్తం తాగే రకం అని చెప్తారు….

ఇవన్నీ ఒక ఎత్తైతే… రష్యా  అధ్యక్షుడు పుతిన్ ఇంకో ఎత్తు. ఈయన  గురించి కొన్ని దిమ్మతిరిగే ముచ్చట్లు తెలిశాయి. తనలో సెక్స్ సామర్థ్యం మరింత పెరిగేందు కోసం రాయల్ స్టాగ్  అంటే దుప్పి  కొమ్ముల నుండి తీసిన  నెత్తురుతోటి స్నానం చేస్తాడట. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ ఛానెల్ చెప్పింది. పుతిన్ల వారు  జలకాల కోసం కింద టేడాది 70 కిలోల దుప్పి కొమ్ములు సేకరించినట్లు ఆ మీడియా కథనంలో పేర్కొన్నది. దుప్పి కొమ్ములతో  తీసిని బ్లడ్ వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు నయం అవుతాయని అక్కడి వారు బలంగా నమ్ముతారట. అందుకే ఈయన నమ్మి ఇట్లా చేసినట్లుంది.

అక్కడ దుప్పి కొమ్ముల నుండి తీసిన పది మిల్లీలీటర్ల రక్తం ధర వంద డాలర్ల వరకు  ఉంటుందట. దీన్ని కొంత మంది తాగుతారట కూడా. మన తాన  గాడిద పాలకు డిమాండ్ ఉన్నట్లు అక్కడ దుప్పి రక్తానికి ఉన్నట్లుంది. అయితే లైంగిక సామర్థ్యం కోసం మన రాందేవ్ బాబాను అడిగితే ఆయనే మంచి ఫార్మూలా ఏదైనా చెప్పే వారు కావొచ్చని  కొందరు సలహా ఇస్తున్నారు పుతిన్ల వారికి.