రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ బారిన పడ్డట్టు కథనాలు వెలువడుతున్నాయి. రష్యాకు చెందిన విదేశాల్లో గూఢచర్యం చేసే సంస్థలో పని చేసిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ నిర్వహిస్తున్న టెలిగ్రామ్ ఛానెల్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తా కథనాన్ని ప్రచురించింది. క్యాన్సర్‌తో పాటు పార్కిన్ సన్స్ వ్యాధితో పుతిన్ బాధపడుతున్నట్టు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని డాక్టర్లు తేల్చి చెప్పినట్టు సమచారం. ఒకవేళ పుతిన్ సర్జరీ చేయించుకుంటే ఆయన స్థానంలో తాత్కాలికంగా ఆయనకు నమ్మకస్తుడైన దేశ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటెరీ నికోలాయ్ పత్రుషేవ్ను నియమించనున్నట్టు తెలుస్తోంది. పుతిన్ కంటే పత్రుషేవ్ మరింత డేంజర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందని పెంటగాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.