Putin has less than 2 years to live; suffers from grave illnesses: Ukraine
mictv telugu

పుతిన్ బతికేది ఇంకో రెండేళ్లే!

June 28, 2022

ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధంతో విరుచుకుప‌డుతోంది. ఈ యుద్ధంలో ర‌ష్యా సైన్యం దెబ్బ‌కు ఉక్రెయిన్‌లోని చాలా న‌గ‌రాలు నాశ‌న‌మ‌య్యాయి. కాగా ఈ నేపధ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ అనారోగ్యంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మాస్కోలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ ఎక్కువ సేపు నిలబడలేకపోయిన సంగతి కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఈ క్రమంలో.. ఉక్రెయిన్‌ నిఘా విభాగం అధికారి మేజర్‌ జనరల్‌ కైరిలో బుడానోవ్‌.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌(69) ఆరోగ్యం గురించి ఓ కీలక విషయాన్ని తెలిపారు.

పుతిన్ ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని చెప్పారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు.

ఈ ఆరోగ్య సమస్యల కారణంగా పుతిన్‌ను బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనకు డాక్టర్లు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్‌ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్‌ ఇప్పటికే క్యాన్సర్‌ బాధితుడు. గతంలో క్యాన్సర్‌ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.