పుతిన్ ఓ మృగం.. ఆ మృగం ఆకలి ఉక్రెయిన్‌తో తీరదు - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్ ఓ మృగం.. ఆ మృగం ఆకలి ఉక్రెయిన్‌తో తీరదు

March 8, 2022

30

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యా అధ్యక్షుడిపై మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దేశం యుద్ధం ప్రకటించి దాదాపు 13 రోజులు పూర్తి అవుతుంది. అయిన ర‌ష్యా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా సోమవారం రాత్రి నుంచి ఉక్రెయిన్‌పైకి త‌న అమ్ముల పొదిలోని 500 కేజీల బాంబుల‌ను ర‌ష్యా ప్ర‌యోగిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో అస‌లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల‌క్ష్యం ఏమిటో? అస‌లు పుతిన్ ఎలాంటి వారో? ర‌ష్యా అస‌లు టార్గెట్ ఏమిటో? అన్న విష‌యాల‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సందర్భంగా జెలెన్ స్కీ మీడియాతో మాట్లాడుతూ.. ”పుతిన్‌ను ఓ మృగం. ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించ‌డంతోనే పుతిన్ ఆక‌లి తీర‌దు. ర‌ష్యా దండ‌యాత్ర ఉక్రెయిన్‌తో ఆగ‌దు. ఇత‌ర దేశాల‌పై కూడా ప్ర‌భావం చూపుతుంది. పుతిన్ ఓ మృగం లాంటివారు. ఆయ‌న ఎప్ప‌టికీ సంతృప్తి చెందరు. తినేకొద్దీ ఇంకా కావాలంటూ ఆ మృగం మిగిలిన దేశాలపై కూడా ప‌డుతుంది” అని జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.