Putin offers money to women to have 10 kids to repopulate Russia
mictv telugu

10 మంది పిల్లల్ని కనే మహిళలకు రూ.13 లక్షలు.. పుతిన్ బంపర్ ఆఫర్

August 18, 2022

తమ దేశ జనాభా కరిగిపోతున్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఆ దేశ మహిళలకు పది మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. వారంతా సురక్షితంగా ఉంటే.. పదో పిల్లాడి తొలి పుట్టిన రోజున బంపర్ ఆఫర్ ఇస్తానని వెల్లడించారు. పది మంది పిల్లలు సురక్షితంగా ఉంటే గనక ఆ మహిళలకు సుమారు రూ. 13 లక్షలు ఆఫర్ చేస్తానని తెలిపారు.

రష్యా డెమోగ్రఫిక్ సంక్షోభం ఎదుర్కొంటున్నదని, జనాభా సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, సరైన రీతిలో సంఖ్య లేదని నిపుణులు చెబుతున్నారు. 1990వ దశాబ్దం నుంచే రష్యా జనాభా గురించిన ఆందోళనలు ఉన్నాయని, కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరణాలతో ఈ ఆందోళనలు మళ్లీ హెచ్చిందని వివరిస్తున్నారు. ఈ లోటును పూడ్చడానికి పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యన్ పాలిటిక్స్, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ డాక్టర్ జెన్సీ మాథర్స్ ఈ కొత్త రష్యన్ రివార్డు ప్రకటన గురించి బ్రాడ్‌కాస్టర్ హెన్రీ బొన్సుతో టైమ్స్ రేడియాలో మాట్లాడారు. ఈ స్కీమ్‌ను ‘మదర్ హీరోయిన్’ అని పిలుస్తామన్నారు. దేశ జనాభాలో లోటును తిరిగి నింపడానికి ఈ ప్రకటన చేశారని ఆయన వివరించారు.

ఈ ఏడాది మార్చి తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అంతేకాదు, ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైనికులు ఇప్పటి వరకు సుమారు 50 వేల మంది మరణించారు. ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబం ఎక్కువ దేశ భక్తి కలిగి ఉంటున్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నట్టు వివరించారు.