స్వీడన్, ఫిన్లాండ్‌కు పుతిన్ హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

స్వీడన్, ఫిన్లాండ్‌కు పుతిన్ హెచ్చరిక

April 21, 2022

4

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాలు వద్దు వద్దు అంటున్నా అవేమి పట్టించుకోకుండా ఉక్రెయిన్ భీకరమైన దాడులు చేస్తూ, ఉక్రెయిన్ దేశాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహా దాడులు మీపై కూడా చేస్తామని స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు పుతిన్ హెచ్చరికలు జారీ చేశాడు. నాటో కూటమిలో చేరే ఆలోచనను విరమించుకోవాలని. లేకపోతే ఉక్రెయిన్‌కు పట్టిన గతి మీకూ పడుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ.. బహిరంగంగా, దౌత్య మార్గాల ద్వారా ఆ రెండు దేశాలను హెచ్చరించాం. నాటోలో చేరితే ఏమవుతుందో వారికి స్పష్టంగా వివరించాం. రష్యా తీసుకోబోయే చర్యలపై వారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రష్యా గురించి ఆ రెండు దేశాలకు బాగా తెలుసు” అని ఆయన అన్నారు.

మరోపక్క నాటోలో చేరే విషయంపై ఫిన్లాండ్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. నాటో కూటమిలో చేరాలని ఆ దేశ ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి ఎక్కువైంది. దీంతో, కూటమిలో చేరే దిశగా ఫిన్లాండ్  అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.