రష్యాను సుదీర్ఘకాలంగా పరిపాలిస్తున్న నియంత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని పాశ్చాత్య దేశాలకు తెలియనీయకుండా పుతిన్ జాగ్రత్త పడుతున్నాడు. విదేశీ పర్యటనల్లో సైతం తన మల మూత్రాలు శత్రు దేశాలకు చిక్కకుండా వాటిని క్యారీ చేయడానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు. పుతిన్ అంత జాగ్రత్తగా తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడానికి కారణం చనిపోయేంత వరకు రష్యాను పరిపాలించాలన్న కోరికే. ఈ మధ్య ఉక్రెయిన్ యుద్ధంతో పలు పత్రికలు ఆయన ఆరోగ్యంపై అనేక కథనాలు ప్రచురించాయి.
అయితే వాటిని ఇప్పటివరకు క్రెమ్లిన్ కొట్టి పారేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పుతిన్ తాజా వీడియో ఒకటి బయటికి వచ్చింది. దేశంలోని ఓ ప్రముఖ చిత్ర నిర్మాతకు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగగా, పుతిన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన వేదికపైన నిలబడి మాట్లాడుతూ కనిపించాడు. ఈ వీడియోలో పుతిన్ కనిపించినంత సేపు వణుకుతూ ఉన్నాడు. ప్రసంగించేటప్పుడు కాళ్లు కూడా వణుకుతున్నాయి. ఎక్కువ సేపు నిలబడే శక్తి లేనట్టు కనిపించాడు. దీంతో పుతిన్ ఇంకెంతో కాలం రష్యాను పాలించలేడని అమెరికన్ మీడియా ప్రచారం చేస్తోంది. మరి మహా మొండి అయిన పుతిన్ ఎంత కాలం మాస్కోను తన గుప్పిట్లో పెట్టుకుంటాడో కాలమే సమాధానం చెప్పాలి.
Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp
— Mike Sington (@MikeSington) June 14, 2022