పుతిన్ ప్రత్యర్థికి 9 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్ ప్రత్యర్థికి 9 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా

March 23, 2022

13

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి స్థానిక కోర్టు తొమ్మిదేళ్ల జైలు శిక్ష, రూ. 8.75 లక్షల జరిమానాను విధించింది. మోసం, కోర్టు ధిక్కారణ వంటి అభియోగాలలో నావల్నీ దోషిగా తేలారు. నావల్నీ ఇప్పటికే రెండున్నర సంవత్సరాలుగా కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. తాజా శిక్షపై నావల్నీ స్పందిస్తూ.. పుతిన్ పరిపాలన గురించి వాస్తవాలు ప్రజలకు తెలిస్తే ఆయనను అసహ్యించుకుంటారని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. కాగా, గతంలో జరిగిన కోర్టు ధిక్కరణ నేరం కింద తాజా శిక్షను కోర్టు విధించింది. అయితే నావల్నీ తీర్పను సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లే వెసులుబాటు ఉంది. ఈ తీర్పుపై నావల్నీ మద్ధతు దారులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీర్ఘకాలం పాటు నావల్నీ జైల్లోనే గడపాలనే కుట్ర ఉందంటూ పుతిన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.