పీవీ జీవిత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం : ఉత్తమ్ - MicTv.in - Telugu News
mictv telugu

పీవీ జీవిత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం : ఉత్తమ్

June 28, 2020

Uttam

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు జీవిత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శత జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు పీవీ చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను నేతలు కొనియాడారు. 

కొంత మందికి ఇన్నాళ్లకు పీవీ జయంతి గుర్తుకు వచ్చిందని పరోక్షంగా అధికార పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. తాను తాము దీన్ని స్వాగతిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరుపున కూడా ఏడాది పాటు ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. అణగారిన అన్ని వర్గాల్లో ఆశలు నింపిన నేతగా కొనియాడారు.ఆర్థికంగా దేశం క్లిష్టసమయంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతో గొప్పగా ఉన్నాయని చెప్పారు. ఆయన రాజనీతిజ్ఞతను చూసి రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలని హితవు పలికారు.