పీవీకి అరుదైన గౌరవం.. దేశం కాని దేశంలో విగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

పీవీకి అరుదైన గౌరవం.. దేశం కాని దేశంలో విగ్రహం

October 22, 2022

రాజకీయ చాణక్యుడు, సంక్షోభ సమయంలో దేశానికి నాయకత్వం వహించి మలుపు తిప్పిన తెలుగు యోధుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరం సిడ్నీలో శనివారం ఎన్నారైలు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, దివంగత ప్రధాని ఇందిగాంధీల తర్వాత మరో మాజీ ప్రధానికి విదేశాల్లో విగ్రహం ఏర్పాటు కావడం బహుశా ఇదే తొలిసారి. నెహ్రూ, ఇందిరల విగ్రహాలు రష్యాలోని మాస్కోలో ఉన్నాయి.

పీవీ విగ్రహావిష్కరణలో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభివాణి తదితరులు పాల్గొన్నారు. సిడ్నీలోని హోంబుష్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత స్ట్రాత్‌ఫీల్డ్ టౌన్ హాల్లో పీవీ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్మోర్, కౌన్సిలర్ సంధ్యారెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు తదిరులు పాల్గొన్నారు.