ముగ్గురు ముగ్గురే...... - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు ముగ్గురే……

July 17, 2017

తెలుగు రాజకీయాల నుండి ముగ్గురు జాతీయ స్థాయిలో తమ ప్రభావం చూపించారు. ప్రాభవాన్ని పెంచుకున్నారు.  నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుండి మొదలు కొని… ప్రధాన మంత్రిగా పనిచేసిన పి.వి.నర్సింహారావు…. ఇప్పుడు వెంకయ్యనాయుడు. ఈ ముగ్గురు మూడు  సందర్భాల్లో  జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు.  నాటి నేటి రాజకీయాలను పోల్చినా…. పరిస్థితులను బేరీజు వేసి చూసినా  ఈ ముగ్గురు నాయకులు తెలుగు  వారికి గర్వకారణమనే చెప్పాలి.

నీలం  సంజీవరెడ్డి , పి.వి. నర్సింహారావులు కాంగ్రెస్ పార్టీ నుండి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు.  వెంకయ్యనాయుడు   భారతీయ జనతా పార్టీ నుండి వెళ్లారు.  అయితే ఈ ముగ్గురు నాయకులూ నాటి  ఎపి శాసనభకు ప్రాతినిధ్యం వహించిన వారే. నీలం సంజీవరెడ్డి, పి.వి.నర్సింహారావులు నాటి  ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వెంకయ్యనాయుడు ఉమ్మడి సభలో బిజెపి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఈ ముగ్గురిలో మౌన ముని పి.వి., రాజకీయ జీవితానుభవ మాటలు నీలం సంజీవరెడ్డివి. మాటలతో ఆకట్టుకునేది కళ  ఉన్నది వెంకయ్యనాయుడిది.

ఇండియాలో ప్రపంచీకరణ ప్రారంభకుడు  పి.వి. నర్సింహారావు అయితే…. ప్రపంచీకరణ రెండో దశకు చేరుకున్న సందర్భంలో  భారత ఉపరాష్ట్రపతి అవుతున్నది వెంకయ్యనాయుడు. దేశం ఎదగడానికి పునాదులు పడుతున్న దశలో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. ఎదిగుతూ ముందుకెళ్తున్న దశలో వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అవుతున్నారు.