రీమిక్స్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన పీవీ సింధు - MicTv.in - Telugu News
mictv telugu

రీమిక్స్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన పీవీ సింధు

July 4, 2022

బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పీవీ సింధు.. తన ఆటతోనే కాకుండా అప్పుడప్పుడూ తన అభిమానులను ఆటపాటలతోనూ అలరిస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె గతంలో కచ్చాబాదం, మాయాకిర్రియే, బీస్ట్ అరబిక్‌ కుతు తదితర పాటలకు సరదాగా స్టెప్పులేసి అలరించింది. తాజాగా మరో రీమీక్స్‌ పాటకు కాలు కదిపింది. ప్రస్తుతం మలేషియా వెకేషన్‌లో ఉన్న ఆమె ఓ ట్విన్‌ టవర్‌ వద్ద ఈ డ్యాన్స్‌ చేస్తూ వీడియోని, అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

ఇప్పటివరకు దీనికి 2,49,062 మంది లైకులు కొట్టారు. ఆ పోస్టుకు ‘మీకు ఏదైతే నిజమైన ఆనందం కలిగిస్తుందో దాన్ని కచ్చితంగా చేయండి’ అని వ్యాఖ్యానించింది. మరోవైపు సింధు ఆట విషయానికి వస్తే ప్రస్తుతం జరుగుతోన్న మలేసియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడింది. చైనీస్‌ తైపీకి చెందిన తాయ్‌ జు యింగ్‌ చేతిలో శుక్రవారం హోరాహోరీగా తలపడిన మ్యాచ్‌లో చివరి క్షణాల్లో ఒత్తిడికి గురై ఓటమిపాలైంది.