PV Sindhu wins gold in women's singles final at Commonwealth Games
mictv telugu

కామన్‌వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్న పీవీ సింధు

August 8, 2022

కామన్‌వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఖాతాలో గోల్డ్ మెడ‌ల్ ప‌డింది. బ‌ర్మింగ్‌హామ్‌లో జ‌రుగుతున్న కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల బ్యాడ్మింట‌న్ మ‌హిళ‌ల సింగిల్స్‌ ఫైన‌ల్లో సింధు విక్ట‌రీ కొట్టింది. కెన‌డా క్రీడాకారిణి మిచ్చెల్ లీతో జ‌రిగిన మ్యాచ్‌లో 21-15, 21-13 స్కోర్‌తో విజ‌యం సాధించి ప‌సిడి ప‌త‌కాన్ని కైవసం చేసుకుంది. ఈ పతకంతో భారత ఖాతాలో 56 పతకాలు (19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. భారత్ ప్రస్తుతం పతకాల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మ్యాచ్ ప్రారంభం నుంచే అందరి దృష్టి పివి సింధుపైనే ఉంది.

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా స్వర్ణ పతకంపై కన్నేశాడు. పురుషుల డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఫైనల్ ఆడనున్నారు. సాయంత్రం తర్వాత పురుషుల హాకీ జట్టు బంగారు పతక పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టేబుల్ టెన్నిస్‌లో, ఆచంట శరత్ కమల్ కూడా పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ఆడనున్నాడు.