‘వెండి’ కొండ.. ! - MicTv.in - Telugu News
mictv telugu

‘వెండి’ కొండ.. !

August 28, 2017

రియో ఒలంపిక్స్ లో రజతం సాధించి అందరి మన్సులు గెల్సుకున్న  పివీ సింధు మరోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ లో రజతం సాధించింది. జపాన్‌ క్రీడాకారిణి నొజోమీ ఒకుహర చేతిలో పోరాడి ఓడింది. సైనా నెహ్వాల్ కాస్య పతకం గెలుచుకుంది. వీరి విజాయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ దేశం గర్విస్తుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. సింధు, సైనా లను ప్రత్యేకంగా అభినందించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా సింధు, సైనాలు.. పతకాలను గెలవడం చూసి దేశం గర్విస్తుందని ట్వీట్ చేశారు.

వీళ్లు సాధించిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పతకాలకు కానుకగా బ్యాండ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింధుకు 10 లక్షలు, సైనాకు 5 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. మంచి ఫాంలో ఉన్న సింధు, సైనాలు మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.