వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం డేంజరస్. తెలుగులో మా ఇష్టం పేరుతో విడుదలవుతోంది. భారతదేశంలో స్వలింగ సంపర్కుల కథాంశంతో వస్తున్న తొలి చిత్రంగా నిలచింది. అయితే ఈ సినిమా విషయంలో వర్మకు గట్టి షాక్ తగిలింది. ప్రముఖ మల్టీప్లెక్సులైన పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్లు తమ థియేటర్లలో వర్మ సినిమాను ప్రదర్శించలేమని తేల్చి చెప్పాయి. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ రెండు సంస్థలు తమ నిర్ణయంతో స్వలింగ సంపర్కులను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది.
. @_PVRcinemas , @INOXCINEMAS refusing to screen my film KHATRA (DANGEROUS) becos it’s theme is LESBIAN ,and this after Supreme Court repealed section 377 and censor board already passed .it is a clear cut ANTI stand of their managements against #LGBT community pic.twitter.com/GxoHDH7Tjw
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022