యాంకర్ గా పవన్ మాజీ భార్య! - MicTv.in - Telugu News
mictv telugu

యాంకర్ గా పవన్ మాజీ భార్య!

September 10, 2017

మోడల్ గా కెరియర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత హీరోయిన్ అయ్యి, ‘బద్రి ’ సినిమాతో పవన్ కళ్యాణ్ కు భార్య అయిన రేణు దేశాయ్ ఇపుడు యాంకర్ అవతారం ఎత్తబోతుంది. పనన్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలతో కలసి పూణేలో ఉంటున్నారు. ఆ మధ్యన రేణు దేశాయ్ ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ప్రస్తుతం సినీ తారలంతా బుల్లి తెరపై హోస్ట్ లుగా మారుతున్న విషయం తెలిసిందే. రేణు కూడా తెలుగులో ఓ డ్యాన్స్ రియాలిటీ షోకి యాంకర్ గా వ్యవహరించనుంది. త్వరలోనే ఈ మాజీ హీరోయిన్ ను యాంకర్ గా చూడబోతున్నమన్నమాట.