మీరెప్పుడూ చూసి ఉండరు..చిరుత,పైథాన్ మధ్య భీకర పోరు - MicTv.in - Telugu News
mictv telugu

మీరెప్పుడూ చూసి ఉండరు..చిరుత,పైథాన్ మధ్య భీకర పోరు

November 20, 2019

Python And Leopard Fight In Forest

కొండచిలువ, చిరుత రెండూ బలమైన ప్రాణులే. వీటిలో దేని చేతికి చిక్కినా ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ అలాంటి రెండు బలమైన ప్రాణులు ఒకదానితో ఒకటి పోరుకు దిగితే ఎలా ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిజంగానే ఇలాంటి అరుదైన ఘటన చోటుచేసుకుంది. కెన్యా అడవుల్లో కొండ చిలువ, చిరుత పులి మధ్య భీకర పోరు జరిగింది. ఇలా రెండూ హోరాహోరీగా పోటీ పడుతూ ఓ పర్యాటకుడి కెమెరా కంటికి చిక్కాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. 

మాసాయి మారా ట్రయాంగిల్ రిజర్వ్ వద్ద ఒక భారీ పైథాన్‌‌ చిరుతపులిని వేటాడేందుకు ప్రయత్నించింది. నక్కి నక్కి ఉంటూ అది తన వద్దకు రాగానే గట్టిగా చుట్టేసుకొని నిలిపేసేందుకు ప్రయత్నించింది. కానీ వెంటనే అప్రత్తమైన చిరుత ఎదురుదాడికి దిగింది. కొండ చిలువ పైకి ఎగిరి దూకుతూ ప్రతిదాడి చేసింది. కొంతసేపు రెండింటి మధ్య పోరు జరిగింది. చివరగా చిరుత పైథాన్ తలను కొరికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన సఫారీ టూర్ గ్రూప్ సభ్యులు ఆశ్చర్యంతో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వ్యూస్ వచ్చేశాయి.