నగల షాపులో కొండచిలవ  సంసారం.. ఏకంగా 22 గుడ్లు - MicTv.in - Telugu News
mictv telugu

నగల షాపులో కొండచిలవ  సంసారం.. ఏకంగా 22 గుడ్లు

May 4, 2020

లాక్‌డౌన్ కారణంగా దుకాణాలను నెలన్నరకు పైగా మూసేసి ఉంచారు. నిత్యావరసరాలు అమ్మే షాపులు మినహాయిస్తే బట్టల దుకాణలతో సహా ఎన్నో షాపులు మూతపడ్డాయి. కొన్నిచోట్ల పాక్షిక సడలింపులు ఇస్తుండడంతో యజమానులు వాటిని తిరిగి తెరవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అలా తన షాపు షెట్టర్ తెరిచిన ఓ నగల దుకాణం యజమానికి లోపల కనిపించిన సీన్ చూసి ముచ్చెమటలు పోశాయి. 

కేరళలోని కన్నూర్‌లోని ఓ జ్యుయెలరీ షాపులో కొండచిలువ సంసారం చేసింది, ఏకంగా 22 గుడ్లు పెట్టింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఇంకొన్ని రోజులు ఉంటే ఆ గుడ్లు పగలి పిల్లలు బయటికొచ్చేవని అధికారులు చెప్పారు. మూసేసిన షాపులను తెరిచేటప్పుడు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమిసంహాకరాలను వాడాలని సూచించారు.