సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన షాలిని అలియాస్ ‘కతర్ పాప’కు కొత్త కష్టం వచ్చింది. ప్రేమ పేరుతో తనను గర్భవతిని చేసి మొఖం చాటేశాడంటూ తన ప్రియుడు రోహిత్ పఠాన్ ఖాన్‌పై ఎస్సార్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 376 రేప్ కేస్, 420 చీటింగ్ కేస్ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం షాలినిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకెళితే.. బోల్డ్ కంటెంట్‌తో పాపులర్ అయిన కతర్ పాప అలియాస్ శాలిని టిక్ టాక్ ద్వారా పేరు తెచ్చుకుంది. అది బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో ట్రెండింగులో ఉంటూ వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెళ్లు నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా మరింత వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్ పఠాన్ ఖాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. తర్వాత ప్రేమిస్తున్నానంటూ రోహిత్ ఆమె వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన కతర్ పాప.. అతడిని ఇష్టపడి కలిసి తిరిగింది. వీరి ప్రేమ విషయం ఫాలోవర్లకు కూడా తెలుసు. పలు ఇంటర్వ్యూలలో వీరు తమ ప్రేమ గురించి గొప్పగా చెప్పుకున్నారు. తన గురించి అన్నీ తెలిసే రోహిత్ తనను ప్రేమించాడని, పెళ్లి కూడా చేసుకుంటామని నమ్మకంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే ఆరు నెలలుగా ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. ఫలితంగా షాలిని గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని షాలిని కోరగా రోహిత్ తిరస్కరించాడు. దాంతో శాలిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.