QR Codes for Domestic LPG Cylinders: Union Minister Hardeep Singh Puri
mictv telugu

గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. కేంద్రం కీలక నిర్ణయం

November 17, 2022

ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లపై కేంద్రం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్ వంటివి అరికట్టడానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ తెచ్చినట్టు ప్రకటించింది. మనకు ఆధార్ కార్డు ఉన్నట్టే ప్రతీ సిలిండర్‌‌కి కోడ్ ఉంటుందని దీని వల్ల సిలిండర్ల నియంత్రణ సాధ్యమవుతుందని వెల్లడించింది. ఆ కోడ్‌‌ని స్కాన్ చేయడం ద్వారా సిలిండర్ యొక్క పూర్తి సమాచారాన్ని పొందవచ్చని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

ఇప్పటివరకు 20 వేల సిలిండర్లకు కోడ్ ఏర్పాటు చేయగా, మరో మూడు నెలల్లో అన్ని డొమెస్టిక్ సిలిండర్లపై ఏర్పాటు చేస్తామని వివరించారు. అన్నికొత్త, పాత ఎల్పీజీ సిలిండర్లు కోడ్‌‌తో వస్తాయని ఇదొక విప్లవాత్మక మార్పు అని అభివర్ణించారు. దీని వల్ల సిలిండర్ పంపిణీదారు ఎవరు? ఎక్కడ నుంచి సప్లై అయ్యింది? ఎప్పుడు, ఎక్కడ విడుదలైంది? డెలివరీ బాయ్ ఎవరు? బరువు, గడువు తేదీ, గోదాం నుంచి ఇంటికి చేరే ప్రయాణం వంటివి స్క్రీన్‌పై చూడవచ్చని పేర్కొన్నారు. దీని వల్ల దొంగతనం,హోర్డింగ్ వంటివి నిరోధించడం సాధ్యమవుతుందని ట్విట్టర్‌‌లో వివరించారు.