రేవంత్ ఇంట్లో కోటిన్నర నగదు, పెద్ద ఎత్తున బంగారం.. - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ ఇంట్లో కోటిన్నర నగదు, పెద్ద ఎత్తున బంగారం..

September 28, 2018

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం రేవంత్ ఇంట్లోంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కోటిన్నర రూపాయల నగదు, పెద్దఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని అధికారులు అడగగా రేవంత్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. బంగారు నగలపై బిల్లులు చూపాలని అడగగా అవి తమ పూర్వీకులవని రేవంత్ కుటుంబ సభ్యులు చెప్పారని తెలుస్తోంది. దీంతో బంగారు నగలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారట.Quantitative cash in the house of Revanth, a large scale gold ..ఇదిలావుండగా రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, మాదాపూర్‌లో నివాసం ఉంటుండగా, ఆయన ఇంట్లోనూ నిన్నటి నుంచి తనిఖీలు జరిపారు. కొండల్ రెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని బ్యాంకు లాకర్లను తెరిచేందుకు తీసుకుని వెళ్ళారు. ముఖ్యమైన దస్త్రాలేమైనా లాకర్లలో వున్నాయని ఈడీ భావిస్తోంది.