రైలు వరమిచ్చినా కనికరించని క్వారంటైన్.. ఏ రాష్ట్రానికి ఆ దారి… - Telugu News - Mic tv
mictv telugu

రైలు వరమిచ్చినా కనికరించని క్వారంటైన్.. ఏ రాష్ట్రానికి ఆ దారి…

May 4, 2020

Quarantine rules in states.

లాక్‌డౌన్ కారణంగా చిక్కుకున్న ప్రజలు స్వరాష్ట్రానికి వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెల్సిందే. దీంతో లక్షలాది మంది సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వీరు వెళ్ళడానికి రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘శ్రామిక స్పెషల్’ రైళ్లను నడుపుతున్నారు. 

అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలను క్వారంటైన్ లో ఉంచనున్నట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తెలిపాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని 21 రోజుల పాటు క్యారంటైన్‌లో  ఉంచుతామని బీహార్ ప్రభుత్వం తెలిపింది. ఒడిశా ప్రభుత్వం 14 రోజుల క్వారంటైన్ ను ప్రకటించింది. పట్టణ ప్రాంతాలకు చెందినవాళ్లకు హోమ్ క్వారయింటైన్, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లకు ప్రభుత్వం సూచించిన కేంద్రాల్లో క్వారయింటైన్ చేయనునట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వచ్చేవరకు రిలీఫ్ కేంద్రంలోనే ఉంచనున్నారు. కేరళ, కర్ణాటక, లడక్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు 14 రోజుల హోమ్ క్వారయింటైన్ నిబంధనలను ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌ లో అయితే ప్రభుత్వ అనుమతితో వచ్చే వారికి 14 రోజుల క్వారయింటైన్, అనుమతి లేకుండా వచ్చే వారికి 21 రోజుల ప్రభుత్వ క్వారయింటైన్ విధించింది. తమిళనాడులో కోవిడ్ పరీక్షలు, ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వ క్వారయింటైన్, నెగిటివ్ వస్తే 14 రోజుల హోమ్ క్వారయింటైన్ తప్పనిసరి. రాజస్థాన్ ప్రభుత్వం 14 రోజుల క్వారయింటైన్ అమలు చేస్తామని ప్రకటించింది.