Queen Elizabeth 2 wrote a letter to the people of Sydney
mictv telugu

బ్రిటన్ రాణి సీక్రెట్ లెటర్.. 2085 వరకు తెరవద్దు.. ఎందుకంటే

September 12, 2022

బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఎలిజబెత్ రాణి 1986లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఓ లెటర్ రాశారు. సిడ్నీ ప్రజలను ఉద్దేశించి రాసిన ఆ లేఖ చారిత్రాత్మక క్వీన్ విక్టోరియా భవనంలోని లాకర్‌లో భద్రంగా ఉంది. దానిని మరో 63 ఏళ్ళవరకు అంటే 2085 వరకు తెరవద్దని ఆమె ఆదేశించారట. అందులో ఏమి రాసి ఉందో ఆమెకు తప్ప ఆమె వ్యక్తిగత సిబ్బందికి కూడా తెలియదు. ఈ విషయాన్ని ఆమె సిడ్నీ రైట్ అండ్ హానరబుల్ మేయర్ గారికి రాశారంట. లెటర్‌లోని అంశాలు 1985లో మాత్రమే ప్రజలకు తెలియజేయమని పేర్కొన్నారట. ఆమె ఆదేశాలను గౌరవిస్తూ ఇప్పటికీ ఆ లేఖను ఓపెన్ చేయలేదట. మొత్తం 16 సార్లు ఆస్ట్రేలియా పర్యటించిన రాణి ఎలిజబెత్ అంటే ఆస్ట్రేలియా వాసులకు ఎంతో ప్రేమ. 1999లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే 54 శాతం మంది బ్రిటీష్ రాణియే దేశాధినేతగా ఉంటాలని కోరారంట. దాంతో ఆ పదవిని రద్దు చేయకుండా అలాగే ఉంచేశారు. ఇప్పుడు ఆమె మరణించడంతో తదుపరి రాజు కింగ్ చార్లెస్‌ను తమ గవర్నర్ జనరల్‌గా ఆస్ట్రేలియా ఆమోదించింది. న్యూజిలాండ్ కూడా ఇదే పని చేసింది.