Home > Featured > దోసిళ్లతో  తాగండి, గుడ్డను వాడండి.. బీజేపీ ఎంపీ 

దోసిళ్లతో  తాగండి, గుడ్డను వాడండి.. బీజేపీ ఎంపీ 

Meenakshi Lekhi....

‘మంచినీళ్లను తాగడానికి ప్లాస్టిక్ బాటిల్‌ను ఎందుకు వాడాలి? దోసిలి పట్టి తాగితే సరిపోతుంది కదా?’ అని అని బీజేపీ నేత, ఎంపీ మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దోసిలి వ్యాఖ్యలతో ఆగని మీనాక్షి మహిళలకు ఉచిత సలహా ఇచ్చి మరింత ఆగ్రహానికి గురయ్యారు. మహిళలు శానిటరీ ప్యాడ్స్ కు బదులు గుడ్డను వాడాలని, మన అమ్మమ్మలు, తల్లులు అదే వాడారని చెప్పుకొచ్చారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమె మనస్తత్వానికి ఇవి అద్దం పడుతున్నాయని పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు.

ఈరోజు పర్యావరణ పరిరక్షణకి సంబందించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మీనాక్షి ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడానికి కొన్ని సూచనలు చేశారు. మంచినీళ్లను ప్లాస్టిక్‌ గ్లాసుల్లో తాగకూదని, దోసిలితో పట్టుకుని తాగాలని ఆమె అన్నారు. అలా తాగితే గ్లాసులను కడుక్కోవాల్సిన ఖర్మ తప్పుతుందని కూడా చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు స్కూల్‌‌లో మంచి నీళ్లను దోసిలితో పట్టుకుని తాగేవాళ్లమని గుర్తు చేశారు. పళ్ళు తోముకోడానికి బ్రష్‌లకు బదులు మన పాత అలవాటైన వేపపుల్లను ఉపయోగించాలని ఆమె తెలిపారు. ‘కూరగాయల వ్యాపారి వచ్చినప్పుడు, తట్టను ఉపయోగిస్తే అక్కడా ప్లాస్టిక్ తగ్గుతుంది. పర్యావరణానికి హాని చేయని బట్ట బ్యాగులను వాడాలి, శానిటరీ ప్యాడ్ల తయారీకి పాత దుస్తులను తిరిగి వాడాలి. మన పూర్వీకులు అవే వాడేవారు. ప్లాస్టిక్ వాడకం తగ్గాలి. నన్నడిగితే శానిటరీ ప్యాడ్లపై 18 శాతం కాదు 28 శాతం జీఎస్టీ ఉండాలంటా’ అని ఆమె వ్యాఖ్యానించారు. దేశీయమైనవి కాని వాటిని కాపీ కొట్టడానికి భారతదేశం తన శక్తి సామర్థ్యాలను, సమయాన్ని వృథా చేసిందని ఆమె వాపోయారు.

మీనాక్షి వ్యాఖ్యలు సంకుచితంగా ఉన్నాయని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలు అనేకం ఉన్నాయని, దోసిళ్లతో తాగుతూ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్యాడ్లపై ఆమె వ్యాఖ్యలు కూడా బుర్రతక్కువగా ఉన్నాయంటున్నాయి.

Updated : 6 Sep 2019 7:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top