ఓబీసీ కోటా పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

ఓబీసీ కోటా పెంపు

October 26, 2017

రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఇతర వెనుకబడిన కులాల కోటాను పెంచింది. ప్రస్తుతం 21 శాతంగా ఉన్న వీరి రిజర్వేషన్లను 26 శాతానికి పెంచుతూ గురువారం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు.

గుజ్జర్లు సహా మొత్తం ఐదు కులాల కోసం కోటాను 5 శాతం పెంచారు. గుజ్జర్లు కోటా కోసం తీవ్రస్థాయిలో ఆందోళన చేయడం తెలిసిందే. ఈ హింసలో పలువురు చనిపోయారు కూడా. వీరికి కోటా కల్పిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. మొత్తం రిజర్వేషన్లు 54 శాతం దాటకూడదన్న నిబంధనే దీనికి కారణం.

అయితే రాష్ట్ర ఓబీసీల జనాభాను బట్టి వారి కోటాను సవరించడం చట్టబద్ధం కనుక తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.