కాశీ మసీదు, తాజ్ మహళ్ల వివాదానికి మరో వివాదం తోడైంది. ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ ముస్లిం రాజులు కట్టించింది కాదని, అది సూర్య గోపురమని భారత పురావస్తు విభాగం(ఏఎస్ఐ) మాజీ అధికారి ధర్మవీర్ శర్మ పేర్కొన్నారు. ‘సూర్యగోళ దిశను అధ్యయనం చేయడానికి రాజా విక్రమాదిత్య దీన్ని నిర్మించాడు. దీన్ని కుతుబ్ అలల్ దిన్ ఐబక్ కట్టించారనడం అబద్ధం’ అని చెప్పారు.
క్రీ.శ. ఐదో శతాబ్దిలో సూర్యుణ్ని, రాత్రి పూట నక్షత్రాలను చూడ్డానికి విక్రమాదిత్య దీన్ని నిర్మించారని, తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈ టవర్ ను చాలాసార్లు అధ్యయనం చేశానని శర్మ తెలిపారు. ఆయనింకా ఏమన్నారంటే.. ‘ఈ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉంది. జూన్ 21న సూర్యుడు అస్తమించే సమయంలో నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదు. అది మతంతో సంబంధం లేని నిర్మాణం. మసీదుకు సంబంధించిది కానేకాదు. దీని తలుపులు ఉత్తరం వైపు ఉన్నాయి. కాశీలోని గ్యాన్ వాపీ మసీదులో, తాజ్ మహల్‌లోని రహస్య గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని ఇటీవల దుమారం రేగుతుండడం తెలిసిందే,