మళ్లీ పనికెళ్తున్నా.. అక్షయ్ వీడియో  - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ పనికెళ్తున్నా.. అక్షయ్ వీడియో 

June 2, 2020

R. Balki on shooting with Akshay Kumar in the lockdown

 మళ్లీ పనికెళ్తున్నా.. కరోనాలో నా జాగ్రత్తలో నేనున్నాను అంటున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. లాక్‌డౌన్ రెస్పాబులిటీస్ పేరుతో తెరకెక్కించిన యాడ్‌లో అక్షయ్ నటించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాడ్‌లో అక్షయ్ లాక్‌డౌన్ సడలింపుల తర్వాత బయట పనులకు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూస గుచ్చినట్టు చెప్పాడు. వీడియోలో ఏముందంటే.. అరే బబ్లూ లాక్‌డౌన్ ఎత్తివేయకముందే బయటకు వెళ్తున్నావేంటీ? అని ఇంటి పక్కనున్న ఓ పెద్దాయన ప్రశ్నిస్తాడు. కరోనా నీ ముందే ఉందీ.. కరోనా అంటే భయం లేదా అంటాడు. దీనికి తాను తిరిగి పనికి వెళ్తున్నానని అక్షయ్ చెప్తాడు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేసే ప్రదేశాల్లో ముఖానికి మాస్కు పెట్టుకుని, ప్రతీ వ్యక్తికి కనీసం రెండు గజాల దూరంలో ఉండేలా చూసుకోవాలని వివరిస్తాడు. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. ప్రతీసారి చేతులను శానిటైజర్‌తో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఇతర ప్రాణాలను రక్షించిన వారమవుతామని యాడ్‌లో అక్షయ్ చెబుతాడు. ఈ యాడ్ ప్రస్తుతం చాలా మందిని ఆలోచింపజేస్తోంది. కాగా, ఈ యాడ్‌కు బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కీ దర్శకత్వం వహించారు.