తమిళ నటుడు మాధవన్.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. అదే సమయంలో మాధవన్ రజనీకాంత్ పాదాలకు నమస్కరించి గౌరవ భావాన్ని చాటుకున్నాడు. ఆ సమయంలో నంబి నారాయణన్ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఫొటోలను మాధవన్ స్వయంగా ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు. ‘‘నంబి నారాయణన్ సమక్షంలో పరిశ్రమ అంటే కనిపించే ఒకే ఒక్కడు, దిగ్గజ నటుడి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవడం.. నిజంగా ఈ క్షణం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. రాకెటరీ గురించి మీ మంచి మాటలకు, అభిమానానికి ధన్యవాదాలు రజనీకాంత్ సర్. మీ ప్రోత్సాహం మమ్మల్ని పూర్తిగా పునరుజ్జీవింప చేస్తుంది. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం” అంటూ మాధవన్ ట్వీట్ చేశాడు. నంబి నారాయణన్ ఇస్రో మాజీ శాస్త్రవేత్త అనే సంగతి తెలిసిందే.
When you get the blessings from a one man industry & the Leagend himself in the presence on @NambiNOfficial -it’s a moment etched for eternity-Thank you for you kindest words on #Rocketry & the affection @rajinikanth sir.This motivation has completely rejuvenated us. We love you pic.twitter.com/ooCyp1AfWd
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 31, 2022