తెలంగాణ యాస - భాషలకు దక్కిన గౌరవం.. ఆర్. నారాయణ మూర్తి ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ యాస – భాషలకు దక్కిన గౌరవం.. ఆర్. నారాయణ మూర్తి !

July 28, 2017

తెలంగాణ యాస – భాషలను కేవలం నెగెటివ్ పాత్రలకు, కమెడియన్లకు మాత్రమే పరిమితం చేసిన చరిత్ర తెలుగు సినిమాదని కుండ బద్దలు కొట్టారు ఆర్. నారాయణ మూర్తి. ‘ ఫిదా ’ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన నెల్లూరు బిడ్డ శేఖర్ కమ్ముల అని కొనియాడారు.

తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టి ఆ భాషలో, ఆ మాండలికంలో వున్న కమ్మదనాన్ని తెలుగు ప్రపంచానికి అందించారని శేఖర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరు పేరున ఆ సినిమాలో నటించిన నటీనటులను, సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ ను అభినందించారు.