ఇప్పటికైనా అర్థం చేస్కో అల్లు అరవిందూ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇప్పటికైనా అర్థం చేస్కో అల్లు అరవిందూ..

June 8, 2017

‘ మందిది మంగళవారం మనది సోమవారం ’ అనడంలో మన తెలుగు సినిమావాళ్ళు పర్ ఫెక్టు ఫిగర్స్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సిన్మాను కాపీ కొట్టి హిందీలో ‘ రాబ్తా ’ సినిమా తీశారని అల్లు అరవిందుల వారు కోర్టులో కేసేశారు. నా సినిమాకూ మీ సినిమాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందిరా నాయినా.. అని రాబ్తా డైరెక్టర్ దినేష్ విజాన్ ఎంత మొత్తుకున్నా వినకుండా కోర్టును ఆశ్రయించిన అల్లూ వారికి గొప్ప బుద్ధి చెప్పి పంపారు ముంబాయి కోర్టువారు.

కోర్టువారు కూడా రెండు సినిమాలు చూసాక ‘ అది నక్క ఇది నాగలోకం ’ అని తీర్పివ్వడంతో అరవిందుల వారు తోక ముడుచుకొనిర హైదరాబాదు వచ్చేసారు. ఈయనను ఆదర్శంగా తీస్కొని హాలివుడ్, బాలీవుడ్, నాలీవుడ్, కోలీవుడ్, రష్యన్, ఇరానియన్, కొరియన్ వంటి.., వుడ్లందరూ కేసులు పెట్టాలి గానీ మనవాళ్ళలో 95% పచ్చి చూచిరాత దొంగల్లా దొరికిపోతారేమో.. గొప్ప క్రియేటివ్ డైరెక్టర్లమని చెలామణి అవుతున్న త్రివిక్రమ్, రాజమౌళి, వినాయక్, అశోక్ ఎక్సెట్రా ఎక్సెట్రా వంటి.., దర్శకులమీద బోలెడు కేసులు రిజిష్టర్ అవుతుండొచ్చు మరి. పేరులోనే అరని ఇముడ్చుకున్న విందుల వారికి మరి మన దెగ్గరున్న దోపిడీ దొంగలు పూర్తిగా కళ్ళకి కాన రావటం లేదా ?