మోదీ గొంతు కోసేందుకు సిద్ధంగా ఉన్నారు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ గొంతు కోసేందుకు సిద్ధంగా ఉన్నారు

November 22, 2017

బిహార్‌లో బీజేపీ, ఆర్జేడీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రధాని మోదీని  వేలెత్తి విమర్శిస్తే వేళ్లు, చేతులు నరికేస్తామని బీజేపీ ఎంపీ నిత్యానంద్ రాయ్ ప్రకటించడంపై ఆర్జేడీ చీఫ్ లూలూ ప్రసాద్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ ఘాటుగా స్పందించారు.‘వాళ్లు వేళ్లు నరుకుతామన్నారు. అలా చేసి చూడండి.. దేశంలో ఎవరూ ఊరుకోరు.. ప్రధాని నరేంద్ర మోదీ గొంతు కోయడానికి, ఆయన చేతులు నరకడానికి చాలామంది బిహారీలు సిద్ధంగా ఉన్నారు.. మరి వారందర్నీ బీజేపీ ఏం చేస్తుంది? ఎంతమందిని జైల్లో పెడుతుంది ’ అని ఆమె ప్రశ్నించారు.