బాణసంచాను రెండు గంటలే కాల్చాలి.. పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

బాణసంచాను రెండు గంటలే కాల్చాలి.. పోలీసులు

October 25, 2019

Rachakonda CP On Diwali Crackers

సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసారి కూడా దీపావళికి కేవలం రెండు గంటలే నిబంధన అమలు చేస్తున్నారు. రాత్రి పూట కేవలం రెండు గంటలు మాత్రం బాణసంచా కాల్చాలని  రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ నిబంధనలు ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

దీపావళి అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది బాణసంచా కాల్చడం. ఆ రోజున కాల్చే టపాకాయల వల్ల పర్యావరణం పాడైపోతుందని పర్యావరణ ప్రేమికులు అడ్డు చెబుతున్నారు. దీంతో గతంలో సుప్రీం కోర్టు దీనిపై కొన్ని షరతులు పెట్టింది. బాణసంచాను పూర్తి నిషేధించలేం కానీ, కేవలం రెండు గంటలు మాత్రమే కాల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా అధికారులు ప్రతి ఏటా చర్యలు చేపడుతున్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాకాయలు కాల్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.