తాడిపత్రిలో రచ్చ రచ్చ.. ఆయన విగ్రహం అవసరమా..? - MicTv.in - Telugu News
mictv telugu

తాడిపత్రిలో రచ్చ రచ్చ.. ఆయన విగ్రహం అవసరమా..?

February 18, 2022

open

‘తాడిపత్రి రహదారిపై విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆయనేమన్నా స్వాతంత్ర సమరయోధుడా?’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తాడిపత్రిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం ఏర్పాటు అవసరమా. దీనిపై కలెక్టర్ నాగలక్ష్మికి 20 పర్యాయాలు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మా నాన్న స్వాతంత్ర సమరయోధుడు. దేశం కోసం పోరాడుతూ, నాలుగు పర్యాయాలు రాయవెల్లూరు జైల్లో ఉన్నారు. రెండు సార్లు ఎంపీగా చేశారు. ఎమ్మెల్సీగా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేశారు. ఆయన విగ్రహం పెట్టాలని నా వద్దకు చాలామంది వచ్చారు. అందుకు నాకు ఇష్టం లేదని చెప్పా. నచ్చని వాళ్లు కుళ్లిపోయిన వంకాయలో, చెప్పులో విగ్రహంపైకి విసురుతారు. లేదంటే కిరసనాయిలు పూస్తారు. మా నాన్నను ఆ విధంగా చూడాలని అనుకోవడం లేదు” అని వారితో చెప్పానని జేసీ తెలిపారు.

అంతేకాకుండా ఇవాళ ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఓ అనామకుడిది. ఈ ఎమ్మెల్యేది పెద్ద దౌర్భాగ్యం. తండ్రి విగ్రహం సొంత చేతులతో ప్రారంభించుకోలేకపోయాడు. ఇరవైనాలుగు గంటలూ తాగి తూలుతుండే వ్యక్తితో మీ నాన్నకు ఓ దండ వేయించావు. ఆ విధంగా తండ్రిని అవమానించుకున్నావు అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విమర్శాలు సంధించారు.