Radha Vembu, India’s third-richest self-made woman billionaire in 2022
mictv telugu

మూడవ అత్యంత సంపన్న మహిళ బిలియనీర్ రాధా వెంబు!

February 11, 2023

third-richest self-made woman billionaire

2022లో భారతదేశంలో మూడవ అత్యంత సంపన్న మహిళ బిలీయనీర్ గా రాధా వెంబు నిలిచింది. ఆమె రూ. 129 వేల కోట్ల నికర విలువతో ఈ స్థానాన్ని సంపాదించుకున్నది.జోహూ మెయిల్ ప్రొడక్ట్ మేనేజర్ రాధా వెంబు గతేడాది ఏప్రిల్ లో హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చే ప్రతిష్టాత్మకమైన జాబితాలో చేరింది. ఇలా ఆ జాబితాలో మూడవ స్థానం పొందిన భారతీయ మహిళ ఆమె. ఇప్పుడు ఆమె నైకా ఫల్గుణి నాయర్, కిరణ్ మజుందార్ షా తో కలిసి పని చేయనున్నారు.వెబ్ ఆధారిత వ్యాపార సాధనాలను తయారుచేసే టెక్ కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న రాధ వెంబు అత్యంత ధనిక స్వీయ నిర్మిత మహిళ బిలియనీర్ గా ప్రసిద్ధికెక్కింది. 1996లో వెంబు తోబుట్టువులు రాధ, శ్రీధర్ జోహుతో కలిపి ఈ సంస్థను స్థాపించారు.

విద్య.. వ్యక్తిగతం..

1972 డిసెంబర్ 24న చెన్నైలో రాధ వెంబు జన్మించారు. ఆమె చెన్నైలోని నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత 1997లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసు నుంచి పారిశ్రామిక నిర్వహణలో పట్టభద్రురాలైంది.

పనితనం..

1996లో రాధ వెంబు ఉన్నత చదువులు చదువుతూనే ఉంది. ఆ సమయంలోనే పీహెచ్ డీ చేసిన తన సోదరుడు శ్రీధర్ తో కలిసి ఒక కంపెనీని స్థాపించారు. ఆమె సోదరుడు ప్రిన్స్ టన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కంపెనీకి మొదట్లో అడ్వెన్ నెట్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిని జోహూ కార్పొరేషన్ గా మార్చారు. రాధా వెంబు జానకి హై-టెక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, వ్యవసాయ ఎన్ జీవో, హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ ఎస్టేట్ కంపెనీకి డైరెక్టర్ గా కూడా ఉన్నారు.

ఏప్రిల్ 2022 నాటికి ఫోర్బ్స్ ప్రకారం.. రాధ నికర విలువ 129 వేల కోట్ల రూపాయలు. ఆమె తన సంపదలో ఎక్కువ భాగాన్ని జోహూలో తన వాటా నుంచి పొందుతున్నది. వెంబు తోబుట్టువులు ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో రూ.285వేల కోట్లతో 55వ స్థానంలో ఉన్నారు.