Radhakrishna temple with Rs. 200 crores.. where?
mictv telugu

రూ.200 కోట్లతో రాధాకృష్ణ మందిరం..ఎక్కడంటే?

September 2, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలో రూ. 200 కోట్లతో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాలని ఇస్కాన్ ప్రతిపాదించింది. 25 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ త‌ల‌పెట్టిన ఈ మందిరానికి భూమిని కేటాయించాలంటూ, ఇస్కాన్ ప్రతినిధులు శుక్రవారం అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ..”హైద‌రాబాద్‌కు స‌మీపంలోని సంగారెడ్డి జిల్లాలో సాధార‌ణ ధ‌ర‌కు లీజు పద్ధతిలో అనువైన స్థలాన్ని కేటాయించామని మంత్రిని కోరాము. దాంతో ఆయన ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆదేశాల మేరకు రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాలన్న నిర్ణయంపై ముందుకెళ్తామని అన్నారు. అన్నీ సక్రమంగా కుదిరితే, మందిర ప్రాంగ‌ణంలో గురుకులం, వృద్ధాశ్రామం, గోశాల కూడా నిర్మిస్తాం” అని అన్నారు.

ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ..హైదరాబాద్ నగరంలోని ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజచార్యుల విగ్రహాన్ని  ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కూర్చొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే ఇది రెండో ఎత్తైన విగ్రహం. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా రామానుజాచార్య విగ్రహాం ప్రసిద్దికెక్కింది. మొత్తం 12 రోజులపాటు ఈ వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో మరోసారి 25 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 200 కోట్లతో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాలని ఇస్కాన్ ప్రతిపాదించటంపై కేసీఆర్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటున్నది చర్చనీయాంశంగా మారింది.