లవ్వు పేరుతో మాతాజీ మోసం - MicTv.in - Telugu News
mictv telugu

లవ్వు పేరుతో మాతాజీ మోసం

September 8, 2017

బాబాలు, మాతాజీలు ఆధ్యాత్మక ముసుగులో ప్రజలను మోసంచేస్తున్నారు. తాజాగా గుర్మింత్ సింగ్ కు  హత్యాచార కేసులో 20ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు మరొక ఆధ్యాత్మిక వివాదాస్పద మాతాజీ రాథేమా (అలియాస్ )సుఖ్వింధర్ కౌర్ లీలలు కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి.తనను తాను దైవాంశ సంభూతురాలుగా చెప్పే మాతాజీ రాథేమా,నన్ను ప్రేమ పేరిట హింసించిదని విశ్వహిందూపరిషత్త్ సభ్యుడు సురేందర్ మిట్టల్ ఆరోపించాడు. తనను రాథేమా అనేక రకాలుగా ప్రలోభపెట్టి హింసించిదని తెలిపాడు. ఇది ఇప్పటి ముచ్చటకాదు రెండళ్ల నాటిదని అప్పుడు మీడియాలో కూడా విస్తృత ప్రచారం జరిగిందని నా తరుపున న్యాయవాది ఆమెకు నోటిీసులు పంపించినా కూడా రాథేమా  కోర్టుకు హాజరు కాలేదు. కోర్టుధిక్కారం కింద కూడా నోటిీసులు ఆమెపై ఫైల్ చేశామని. హైకోర్టు అమెకు శిక్ష విధిస్తుందని ఆశిస్తున్నాను అని సురేందర్ మిట్టల్ తెలిపాడు.

బాబాలు, స్వామిజీలు, మాతాజీ లు దేవుడు ముసుగులో దందాలు చేస్తున్నవారిని వెలుగులోకి తీసుకురావలని మిట్టల్ పేర్కొన్నాడు. రాథేమాపై పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు సీరియస్ అయింది. సురేందర్ మిట్టల్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఏఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను గత మూడు రోజుల కింద  ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.