రాధేమా అశ్లీల డ్యాన్స్..


పేరు గొప్ప బాబాలు, మాతాజీల అసలు బండారం సోషల్ మీడియా పుణ్యమా అని మరింత బాగా బట్టబయలవుతోంది. అధ్యాత్మిక బోధనలు చేస్తూ భక్తులను దగా చేస్తున్న ముంబై మోడరన్ మాతాజీ రాధేమా అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆశ్రమంలో కాషాయ దస్తులు వేసుకుని భక్తిగీతాలు, నృత్యాలతో అమాయక ప్రజలకు దైవభక్తిని బోధించి రాధేమా అందుకు పూర్తి భిన్నమైన దుస్తులు హావభావాలు, చిందులతో ఎలా ఉగిపోతోందో మీరే చూడండి. ఆమె అచ్చం కేబరే డ్యాన్సర్‌లాగా స్టెప్పులేస్తోంది. ఏకంగా ఒకడు ఆమెను ఎత్తుకుని డ్యాన్స్ వేస్తున్నాడు. రెండు అత్యాచారాల కేసుల్లో జైల్లో పడిన డేరాబాబాకు రాధేమా ఇటీవల మద్దతివ్వడం తెలిసిందే. ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో హౌస్ ఆఫీసర్ కుర్చీలో కూర్చున్న ఈ మాతాజీ ఫోటోలు ఇటీవల వివాదాస్పదం అయ్యాయి. రాధేమా పలువురుని మోసం చేసిందని, కాపురాలు కూల్చిందని ఆరోపణలు ఉన్నాయి.

SHARE