ఫస్ట్ డే కలెక్షన్లలో ‘పుష్ప’ను దాటేసిన ‘రాధేశ్యామ్’ - MicTv.in - Telugu News
mictv telugu

ఫస్ట్ డే కలెక్షన్లలో ‘పుష్ప’ను దాటేసిన ‘రాధేశ్యామ్’

March 12, 2022

allu

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం కలెక్షన్లలో తొలిరోజు దుమ్ము రేపింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రూ. 79 కోట్లను వసూలు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ను దాటేసింది. పుష్ప ఫస్ట్ డే రూ. 71 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ‘ బాక్సాఫీసును రాధేశ్యామ్ శాసిస్తోందని’ ట్వీట్ చేసింది. లాక్‌డౌన్ తర్వాత వచ్చిన తమ చిత్రాన్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపింది. విజువల్ వండర్‌గా చెప్తోన్న ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ స్థాయిలో వసూలు చేయడం విశేషం. అయితే కొందరు ఈ చిత్రాన్ని పుష్పతో పోలుస్తున్నారు. పుష్ప సినిమా విడుదలైనప్పుడు ఇలాగే మిశ్రమ స్పందన వచ్చిందనీ, కానీ తర్వాత పుంజుకుని రూ. 330 కోట్లు వసూలు చేసిందని గుర్తు చేస్తున్నారు. మరి రాధేశ్యామ్ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.