‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పుడంటే - MicTv.in - Telugu News
mictv telugu

‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పుడంటే

March 28, 2022

ppp

బాహుబలి ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్ చిత్రం త్వరలో ఓటీటీలో రానుంది. ఏప్రిల్ 1న ఉగాది పండుగకు ఒకరోజు ముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. భారీ బడ్జెట్ చిత్రంగా ప్రపంచ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాపీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్య అనే జ్యోతిష్కుడిగా నటించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కీలక పాత్ర పోషించారు. కాగా, ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇదికాక, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని సినిమాల్లో నటిస్తున్నాడు.