పాపులారిటీ కోసం వాళ్లు అవన్నీ చేస్తారేమో.. నేనలా కాదు - MicTv.in - Telugu News
mictv telugu

పాపులారిటీ కోసం వాళ్లు అవన్నీ చేస్తారేమో.. నేనలా కాదు

May 30, 2022

కాంట్రవర్సీకీ మరో కేరాఫ్ అడ్రస్ హీరోయిన్ రాధిక ఆప్టే. తెలుగులో రక్తచరిత్ర, ధోని, లెజండ్ , లయన్ సినిమాలలో నటించిన ఈ సెక్సీ భామ.. గతంలో టాలీవుడ్ హీరోపై కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కుంది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కానీ, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఇతర భాషలలో నటిస్తూనే ఉంది. పెర్ఫార్మర్‌గా తనకు మంచి పేరుకున్న తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తోటి హీరోయిన్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి మళ్ళీ దుమారం రేపింది.

ముఖం, శరీరభాగాలకు సర్జరీ చేయించుకున్న హీరోయిన్స్‌.. పాపులారిటీ కోసం వాళ్ళు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదని చెప్పింది. తాను అలాంటివి భరించలేనని తేల్చి పారేసింది. బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడే చాలామంది హీరోయిన్స్ తమ శరీరాకృతిని మార్చుకున్నవారేనని చెప్పింది. ఇలాంటి వాటికి నేను చాలా దూరం అని, ఇవన్నీ చూసి చూసి అలసిపోయానని వెల్లడించింది. ఇప్పుడు రాధిక చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.